TS ICET RESULTS: టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కేయూ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున TS ICET 2023 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య టి.రమేశ్ వరంగల్‌లో విడుదల చేశారు.
Read Also: Hansika : ఆ దర్శకుడు వలనే నేను సినీ కెరీర్ లో విజయం సాధించాను..
ఈ పరీక్షలో 86.17శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. 61,092మంది అర్హత సాధించినట్టు వెల్లడించారు. ఐసెట్‌లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. ఐసెట్ లో నూకల శరణ్‌కుమార్ మొదటి ర్యాంకు సాధించగా.. సాయినవీన్ రెండు, రవితేజ మూడో ర్యాంకులు సాధించారు. ఎంబీఏ (MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశానికి మే 26, 27 తేదీల్లో తెలంగాణలో 16, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ICET పరీక్షకు దాదాపు 70వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
Read Also: Ee Nagaraniki Emaindi: నిజంగానే ఈ నగరానికి ఏమైంది.. సెకండ్ రిలీజ్లో నాలుగింతల కలెక్షన్సా?
అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు.
మొదటగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
ఐసెట్ ఫలితాలు – 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
హాల్ టికెట్ నెంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.