Site icon NTV Telugu

MLA’s Purchase Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీలు దాఖలు చేసిన ప్రభుత్వం

Highcourt Ts

Highcourt Ts

ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీలు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ దర్యాప్తు చేసి సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి పలు విషయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రభుత్వం… సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించింది. అంతేకాకుండా.. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదని, ఓ రాజకీయ పార్టీ నేతగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై సీఎం మాట్లాడారని, సీఎం ప్రెస్‌మీట్‌ను ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగా చూడాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలను దేశప్రజలకు తెలిపే ప్రయత్నమే సీఎం వ్యాఖ్యలని, ఎఫ్‌ఐఆర్‌, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న అంశాలపైనే సీఎం మాట్లాడారన్నారు. సీఎం మాట్లాడినవి జాతీయ పార్టీని ఉద్దేశించిన రాజకీయ వ్యాఖ్యలని, మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదన్నారు. ‘సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది సంబంధం లేని అంశం.

Also Read : Delhi Road Accident: అంజలి మృతిలో సంచలన విషయాలు.. కారు ఈడ్చుకెళ్లినా గుర్తించడంలో పోలీసుల విఫలం
సీఎం వీడియోలను బహిరంగపరిచారు కాబట్టి సిట్ వల్ల ఉపయోగం లేదనడం ఊహాజనితం. సీఎంకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం పొరపాటు. సీఎం ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఎవరూ వాదించలేదు. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం తగదు. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రద్దు చేయాలని పిటిషనర్లే కోరలేదు. సిట్ రద్దు చేయాలని పిటిషనర్లు కూడా కోరలేదు, నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని, సిట్ పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో చూపలేదని, యూట్యూబ్‌లో వీడియోలను పరిగణలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందనేది ఎఫ్‌ఐఆర్ సారాంశమని, కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లేదు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా తీర్పు ఉందని, యూట్యూబ్‌లో వీడియోలు ఉండటం నిందితులకు నష్టమెలాగో వివరించలేదు. ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమి కాదు. వీడియోలను మీడియా బయటపెట్టడం వల్ల నిందితులకు నష్టమనడం పొరపాటు. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుంది. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జ్‌షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు.’ అని ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు.

Exit mobile version