Site icon NTV Telugu

TS EAPCET : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల

Ts Eapcet

Ts Eapcet

రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఎప్‌సెట్‌ (TS EAPCET) పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్‌ ఎంసెట్‌గా పిలిచేవారు. ఇటీవల టీఎస్‌ ఎప్‌సెట్‌గా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మంగళవారం JNTUH, TS EAPCET-2024 కన్వీనర్, ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి డీన్ కుమార్ మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Weather Updates : అప్పుడే భాగ్యనరంలో మొదలైన భానుడి భగ..భగ..

TS EAPCET-2024 పరీక్షలు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈనె 21న తెలియజేయబడతాయని, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ఈ నెల26 నుండి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 6 అని ఆయన తెలిపారు. పరీక్ష తేదీలు మే 9 నుంచి మే12 వరకు ఉంటాయని, TS EAPCET-2024లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సిలబస్ తో 100 శాతం ఎంట్రన్స్‌ ఉంటుందని పేర్కొన్నారు.

AP Politics: బీజేపీతో పొత్తుపై చర్చలు.. ఢిల్లీకి మొదట చంద్రబాబు, తర్వాత పవన్‌..!

గతంలో ఇంజినీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసే వారు. అయితే.. ఇప్పుడు ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మెడిసిన్(ఎం) అనే పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించింది. దీంతో ఎంసెట్ కు బదులు ఎప్‌సెట్‌గా మార్చారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు మాత్రమే నిర్వహించే పరీక్ష కావడంతో ఎప్‌సెట్(టీఎస్ ఈఏపీసీఈటీ)‌గా పేరు ఖరారు చేశారు.

Exit mobile version