NTV Telugu Site icon

TS Eamcet : తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

Ts Eamcet

Ts Eamcet

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్‌ను జెఎన్‌టీయూహెచ్‌ విడుదల చేసింది. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్ష మే 7, 8, 9 తేదీల్లో, అగ్రికల్చర్-మెడికల్ పరీక్ష మే 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఏదైనా ఒక పరీక్షకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500, మిగతా వారు రూ. 900 చెల్లించాలి. రెండు పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 1000, మిగతా వారు రూ.1800 చెల్లించాలి. అయితే.. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్ -2023)ను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. మండలి తరపున టీఎస్ ఎంసెట్ కన్వీనర్ పరీక్షల నిర్వహణ అధికారిగా ఉంటారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆలస్య రుసుం లేకుండా స్వీకరిస్తారు.

Also Read : Virupaksha: అల్లుడి సినిమాని ప్రమోట్ చేస్తున్న మామ…

ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం పరీక్షను మే 7 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మే 8న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే మే 9వ తేదీన కూడా ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 10, 11వ తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు.