మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల పశ్చిమాసియాలోని బోర్డాన్‌లో మిలిటెంట్ గ్రూపులు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను అమెరికా చాలా సీరియస్‌గా తీసుకుంది. దీటుగా సమాధానం ఇస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఈ పరిణామాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ అగ్రరాజ్యానికి ఇదొక భయంకరమైన రోజుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా బైడెన్ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అమెరికా బలహీనంగా ఉందని.. మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని హెచ్చరించారు.
Read Also: Arvind Kejriwal: నితీష్.. బీజేపీతో కలవడంపై కేజ్రీవాల్ ఏమన్నారంటే..!
అంతే కాదు తాను అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదేకాదని.. అలాగే ఉక్రెయిన్ యుద్ధం కూడా జరిగి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. బైడెన్ అసమర్థ వల్లే బోర్డాన్‌లో విషాదం చోటుచేసుకుందన్నారు. తాను అధ్యక్ష పదవి నుంచి దిగేపోయే సమయానికి ఇరాన్ చాలా బలహీనంగా ఉండేదని.. కానీ ఇప్పుడు బైడెన్ వచ్చాక ఆ దేశానికి వేల కోట్ల డాలర్లు వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ కారణంగానే రక్తపాతానికి కారణమైందని ట్రంప్ విమర్శించారు.
తిప్పికొట్టిన బైడెన్ ప్రభుత్వం
ట్రంప్ చేసిన వ్యా్ఖ్యలను బైడెన్ ప్రభుత్వం ఖండించింది. జాతీయ భద్రతను ట్రంప్ రాజకీయం చేయాలని చూస్తున్నారని తిప్పికొట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు దేశ భద్రతకు హానికరమని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్డాన్‌లో అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 34 మంది గాయాపడ్డారు. ఈ ఘటన వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ వెల్లడించింది.
Read Also: Supreeth Reddy: డైరెక్టర్ గా మారబోతున్న ఛత్రపతి విలన్.. ఏకంగా ప్రభాస్.. ?
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా తాజాగా వ్యాఖ్యాంచారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే విషయంపై హెచ్చరించారు.
