Supreeth Reddy: టాలీవుడ్ విలన్స్ లో సుప్రీత్ రెడ్డి ఒకరు. ఛత్రపతి సినిమాలో కాట్రాజు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అవును.. సుప్రీత్ త్వరలోనే డైరెక్టర్ గా మారబోతున్నాడు. అది కూడా ప్రభాస్ ఫ్యామిలీ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో తన మొదటి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇది నిజమే అని తెలుస్తోంది. ఎప్పటినుంచో సుప్రీత్ డైరెక్టర్ కావాలని కళలు కంటున్నాడట. అందుకు తగ్గట్టే ఒక కథను కూడా రెడీ చేసుకున్నాడని, ఆ కథ యూవీ క్రియేషన్స్ కు నచ్చడంతో పట్టాలెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
నటులుగా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్స్ గా మారిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పటికే నటుడు వేణు.. బలగం సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారాడు. ధనరాజ్ సైతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సుప్రీత్ కూడా తనలోని డైరెక్టర్ ను బయటపెట్టనున్నాడు. అయితే సినిమా దర్శకత్వం అనేది ఎంతో క్లిష్టమైన అంశం. ఇందులో కనుక సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. యూవీ క్రియేషన్స్ ను తన కథతో మెప్పించాడు అంటే సుప్రీత్ లో టాలెంట్ ఉందనే అంటున్నారు. మరి ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుంది.. ? హీరో ఎవరు.. ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.