Site icon NTV Telugu

Iran- Israel: ట్రంప్ సీస్‌ఫైర్ విఫలం.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడులు..!

Iran Israel

Iran Israel

గత కొన్ని రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో అంతా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. సీస్‌ఫైర్ అమలులోకి వచ్చిన 2 గంటలకే ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్) ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్‌కు ఆదేశించానని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ పేర్కొన్నారు. టెహ్రాన్‌కు అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. బీర్‌షెబాలో నివాస భవనాన్ని ఇరానియన్ క్షిపణి ఢీకొంది. ఇందులో నలుగురు మృతి చెందగా.. డజను మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

READ MORE: Shashi Tharoor: బీజేపీలో చేరికపై శశిథరూర్ ఏమన్నారంటే..!

మరోవైపు.. ఇజ్రాయెల్ ఆరోపణలపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడులను ఇరాన్ ఖండించింది. తాము సీస్‌ఫైర్ ఉల్లంఘించలేదని ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించడంతో ట్రంప్ సీస్‌ఫైర్ విఫలమైంది. ఇరాన్ క్షిపణుల దాడికి తక్షణమే ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. దీంతో మిడిల్ ఈస్ట్ పరిణామాలు మళ్లీ ఉద్రిక్తతకు దారితీశాయి. ట్రంప్ మధ్యవర్తిత్వంతో వచ్చిన సీస్‌ఫైర్ 24 గంటలు కూడా నిలబడలేదు. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మళ్లీ ముదిరే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం కూలిపోయిన నేపథ్యంలో ప్రపంచం ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Shashi Tharoor: బీజేపీలో చేరికపై శశిథరూర్ ఏమన్నారంటే..!

Exit mobile version