Donald Trump: ఇరాన్‌కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి జారీ చేసిన హెచ్చరికలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్లో కొత్తగా ఏర్పడిన అధికార యంత్రాంగంతో సైనిక కార్యకలాపాలను ముగించే విషయమై అమెరికా కీలక చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు సానుకూల ధోరణిలో సాగుతున్నాయని చెబుతూనే.. ఒకవేళ తక్కువ సమయంలోనే సరైన ఒప్పందం కుదరకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని తక్షణమే వాణిజ్య కార్యకలాపాల కోసం పూర్తిగా తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ ఈ నిబంధనలకు ఇరాన్ లొంగకపోతే.. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని హెచ్చరించారు. ఇరాన్ అంతటా విస్తరించి ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రధాన చమురు బావులు, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ‘ఖార్గ్ ద్వీపాన్ని’ పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను కూడా ధ్వంసం చేయడానికి వెనుకాడబోమని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా ఈ ప్రాంతాలను ముట్టుకోలేదని, కానీ సహనం నశిస్తే ఇవి తమ తదుపరి లక్ష్యాలు అవుతాయని ఆయన ఘాటుగా స్పందించారు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
Also Read:Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?
గత 47 ఏళ్లుగా ఇరాన్ పాత ప్రభుత్వం సాగించిన ‘హింసా పాలన’ లో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులకు, ఇతర పౌరులకు ఇది ప్రతీకారమని ట్రంప్ అభివర్ణించారు. ఈ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం అంతర్జాతీయంగా చమురు ధరలపై , ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు తమ చమురు దిగుమతుల కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడటంతో, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెంచుతాయి. చర్చల ద్వారా శాంతి నెలకొంటుందా లేక ట్రంప్ అన్నట్లుగా భారీ వినాశనం సంభవిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!