Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీ లోని నిరాశ్రయులు “నగరాన్ని విడిచి వెళ్లాలి” అంటూ, నగరంలో నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. అయితే దేశ రాజధానిని బగ్దాద్‌తో పోల్చేలా వైట్‌హౌస్ చేసిన వ్యాఖ్యలకు వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌజర్ ప్రతిస్పందించారు. “మేము మీకు ఉండటానికి స్థలాలు ఇస్తాము, కానీ రాజధానికి చాలా దూరంగా” అని ట్రంప్ ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు.
SSMB 29 : సింహంతో మహేశ్ బాబుకు సీన్స్.. కార్తికేయ పోస్టు వైరల్
సోమవారం మీడియా సమావేశంలో కూడా ఆయన ఈ అంశంపై మాట్లాడి, నగరాన్ని ఇప్పటివరకు లేనంత సురక్షితంగా, అందంగా మారుస్తామని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన డెమోక్రాట్ మేయర్ బౌజర్ మాట్లాడుతూ.. మేము నేరాల పెరుగుదలను అనుభవించడం లేదని స్పష్టం చేశారు. గత నెలలో ట్రంప్ నిరాశ్రయులను అరెస్ట్ చేయడాన్ని సులభతరం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అలాగే, గత వారం వాషింగ్టన్ డీసీ వీధుల్లో ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిని ప్రవేశపెట్టాలని ఆదేశించారు.