Trump Mexico Operation: సంచలనాలకు కేంద్ర బిందువైన అగ్రరాజ్యం అమెరికా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి అమెరికా తన దక్షిణ సరిహద్దులో పెద్ద అణిచివేతకు సిద్ధమవుతున్నట్లు సమాచారాం. మెక్సికోలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించడానికి యూఎస్ పోరాట విభాగాలు, CIA బృందాలను పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిజమైతే, 100 సంవత్సరాలలో అమెరికన్ దళాలు మెక్సికన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. మెక్సికోలో చివరి US సైనిక చర్య 1916లో జరిగింది, ఆ సమయంలో జనరల్ జాన్ పెర్షింగ్ అధికారంలో ఉన్నాడు.
READ ALSO: Dak Sewa 2.0 App: డాక్ సేవా 2.0 యాప్.. అన్ని పోస్టాఫీస్ పనులు మీ ఫోన్‌లో ఇంటి నుంచే..
ఆపరేషన్‌లో నిఘా సంస్థ CIA..
అమెరికన్ న్యూస్ ఛానల్ NBC న్యూస్ నివేదిక ప్రకారం.. ఈ ఆపరేషన్ మెక్సికోలోని అత్యంత శక్తివంతమైన డ్రగ్ లార్డ్, ఎల్ మెన్చో అని పిలిచే నెమెసియో ఒసేగురా సెర్వంటెస్‌కు వ్యతిరేకంగా ఉంటుందని సమాచారం. ఆయన యొక్క ప్రజా శత్రువు నంబర్ వన్‌గా ఉన్నాడు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, CIA ఇప్పటికే ఆపరేషన్ కోసం ప్రాథమిక శిక్షణను ప్రారంభించాయని ఈ నివేదికలు వెల్లడించాయి. మెక్సికో మిషన్ కోసం స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ (JSOC) ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో డ్రోన్ దాడులు, డ్రగ్ ల్యాబ్‌లు, కార్టెల్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ఉండనున్నాయి. JSOC, CIA నుంచి సంయుక్త బృందాలు ఈ దాడులను నిర్వహిస్తాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే యూఎస్ మిలిటరీ దక్షిణ అమెరికా తీరంలో 14 అనుమానిత డ్రగ్స్ నడుపుతున్న పడవలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 60 మందికి పైగా నార్కో-టెర్రరిస్టులను చంపింది. యూఎస్ అధికారుల నివేదికల ప్రకారం.. ఇప్పుడు లక్ష్యం మెక్సికోలోని కార్టెల్ కమాండ్ సైట్‌లు, డ్రగ్ కింగ్‌పిన్‌లను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం అని వెల్లడించాయి. సోమవారం మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో అమెరికా దళాలను దేశ సరిహద్దు దాటడానికి అనుమతించబోమని స్పష్టంగా ప్రకటించారు. ఏకపక్ష అమెరికా దాడులు కాకుండా, రెండు దేశాల మధ్య సహకార ప్రయత్నం అవసరమని ఆమె పిలుపునిచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ మెక్సికన్ కార్టెల్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. దీంతో అమెరికాకు సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి చట్టపరమైన అధికారం లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అవసరమైతే కార్టెల్‌లను నేరుగా భూమిపై లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అమెరికాలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారు, ఫెంటానిల్ వంటి మాదకద్రవ్యాలు వేలాది మరణాలకు కారణమవుతున్నాయని యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి ఇప్పుడు వాషింగ్టన్‌ను మెక్సికోలో ప్రత్యక్ష జోక్యం వైపు నెట్టివేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: Imran Masood: భగత్‌సింగ్‌ను హమాస్ ఉగ్రవాద సంస్థతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ..