Site icon NTV Telugu

Trump Elon Musk : నడి రోడ్డు మీద ట్రంప్, మస్క్ అదిరిపోయే డ్యాన్స్.. ఓ లుక్కేయండి

New Project (16)

New Project (16)

Trump Elon Musk : ఒకరు అమెరికా మాజీ ప్రెసిడెంట్, మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పవర్ ఫుల్ లీడర్.. మరొకరు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూశాం.. కానీ వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అదికూడా నడి రోడ్డు మీద చేస్తే ఎలా ఉంటుంది?.. ఏంటి అది జరిగే ఛాన్సే లేదు కదా. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పుణ్యమా అని ఇలాంటివి సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ‘స్టే ఇన్ అలైవ్’ పాటకు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అదిరిపోయే స్టెప్పులేసినట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను ప్రచారం కోసం ఎలాన్ మస్క్ ఇటీవలే ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలోనే తాజా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది.

Read Also:PM Narendra Modi: ప్రధాని మోడీ ఖాతాలో మరో రికార్డు.. నెహ్రూ, ఇందిరా తర్వాత ఆయనకే..

ఈ వీడియోను తొలిసారిగా అమెరికాలోని ఉటా సెనేటర్ మైక్ లీ ట్వీట్ చేయగా.. ఎలోన్ మస్క్ రీట్వీట్ చేశారు. మా డ్యాన్స్ ఎలా ఉందని తన ఫాలోవర్స్ ను సరదాగా అడిగాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఏకంగా 6.5 కోట్ల మంది ఈ వీడియోను చూడగా, 3.5 వేల మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియో ఫన్నీగా ఉందని కొందరు వ్యాఖ్యానించగా మరికొందరు విమర్శించారు. ఈ వీడియో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనేక ఓట్లను తెచ్చిపెడుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో వినియోగదారు ఇది తాను చూసిన అత్యుత్తమ వీడియో అని అన్నారు. కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో తెలుసుకోలేకపోతున్నామని మరో నెటిజన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు

Exit mobile version