Trump Hamas warning: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎందుకని అనుకుంటున్నారు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై కన్ను పడింది. దానికి సాధించుకోడానికి ఈ యుద్ధాన్ని ఆపాలని కంకణం కట్టుకున్నాడు. ఏ దేశం అభ్యంతరాలను, ఆంక్షలను లెక్కచేయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహును వైట్ హౌస్‌కు పిలిపించి మరీ గాజా యుద్ధం విషయంలో ఆయనను ఒక అభిప్రాయానికి తీసుకురాగలిగారు. ఇంతకీ గాజా యుద్ధంలో ట్రంప్, నెతన్యాహు తీసుకున్న నిర్ణయం ఏంటి, హమాస్‌కు ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
కేవలం నాలుగు రోజులే టైం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ముందుకు గాజా యుద్ధంలో ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారు. దానికి నెతన్యాహు మద్దతు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ ప్రతిపాదనకు హమాస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంప్ ఈ ప్రతిపాదనకు స్పందించాలని హమాస్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఒక రకంగా మాస్ వార్నింగ్ లాంటిది. శాంతి ప్రణాళికకు స్పందించడానికి హమాస్‌కు కేవలం మూడు నుంచి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని, దీనికి హమాస్ అంగీకరించకపోతే దాని కథ విషాదకరంగా ముగిసిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇంతకీ ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళిక ఏంటో తెలుసా..
ట్రంప్, నెతన్యాహు – హమాస్‌కు గాజా యుద్ధం విషయంలో ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఇంతకీ ఆ ప్రతిపాదనన ఏమిటి అంటే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, మానవతా సహాయం, గాజా పునర్నిర్మాణానికి బదులుగా హమాస్ తన ఆయుధాలను అప్పగించాలని ఈ ప్రణాళిక కోరుతోంది. అయితే ఇది ప్రస్తుతం పాలస్తీనా దేశానికి ఏవిధమైన స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. ఈ ప్రతిపాదనలో 20-పాయింట్ల ఉన్నాయి. దీని ప్రకారం.. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ 72 గంటల్లోపు విడుదల చేయాలి. ఇగ హమాస్ నాయకత్వం ట్రంప్ ప్రతిపాదనపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. వాస్తవానికి పలువురు విశ్లేషకులు ఇది హమాస్‌కు ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగ్‌గా అభివర్ణిస్తున్నారు.
READ ALSO: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?