అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులకు మరో షాక్ ఇచ్చాడు. తాజాగా అధికారిక రహస్య దస్త్రాలను తన ఇంట్లో దాచిన కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల మియామీలోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో స్థానిక క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లారు. మాజీ అధ్యక్షుడు రావడంతో అక్కడున్న వారు ఆనందంలో మునిగిపోయారు. ఆయనతో చేతులు కలుపుతూ.. పాటలతో ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: MP Mopidevi Venkataramana: వైసీపీ ఎంపీకి నిరసన సెగ..
ఈ క్రమంలోనే అందరికీ ఆహారం ఉచితం అంటూ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా సౌండ్ చేస్తూ ప్రకటించారు. దాంతో తాము తిన్నదానికి ట్రంపే బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో జనం భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ట్రంప్ ప్రకటించాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు.. అయితే కాసేపటికే అంతా షాక్ తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
Also Read: Nusrat Jahan Choudhury: మొదటి ముస్లిం మహిళను ఫెడరల్ జడ్జిగా నియమించిన అమెరికా
పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కంగుతిన్న మద్దతుదారులు.. ట్రంప్ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారు. ట్రంప్ ఆ రెస్టారెంట్‌లో పది నిమిషాలు మాత్రమే ఉన్నాడు.. ఎలాంటి ఆర్డర్ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిపోయిన ట్రంప్ మాత్రం తన ప్రైవేట్ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక వార్త పత్రికలు కథనాలు ప్రచురించాయి. అయితే ఈ ఘటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి.