Trump: ట్రంప్ ప్రకటనతో మారిన చమురు లెక్కలు.. రూ.5,440 కోట్ల భారీ బెట్టింగ్ వెనుక అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: తన నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టి్స్తున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన ఇరాన్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఇరాన్ ఇంధన కేంద్రాలపై జరగాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. అయితే, ఈ ప్రకటన వెలువడటానికి సరిగ్గా 15 నిమిషాల ముందే సుమారు 580 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,440 కోట్లు) భారీ వ్యాపారం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ విషయాలు ఏంటో ఆ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: 10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ఆ 15 నిమిషాల ‘మిస్టరీ’ ..
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని పోస్ట్ చేయడానికి కేవలం 15 నిమిషాల ముందే చమురు మార్కెట్లో భారీ బెట్టింగ్ జరిగింది. న్యూయార్క్ సమయం ప్రకారం ఉదయం 6:49 నుంచి 6:50 గంటల మధ్య, అంటే కేవలం ఒక్క నిమిషంలోనే బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ధరలు తగ్గుతాయని అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు సుమారు 6,200 కాంట్రాక్టులపై పందెం కాశారు. ట్రంప్ ప్రకటన రాగానే అంచనా వేసినట్లే చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆ 15 నిమిషాల ముందు ట్రేడింగ్ చేసిన వారు భారీ లాభాలను ఆర్జించారు. ట్రంప్ తన పోస్ట్‌లో.. “అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇరాన్ ఇంధన వ్యవస్థలపై జరగాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలుతున్న షేర్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేసింది. అమెరికాతో నేరుగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ స్పష్టం చేసింది. ఇది ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికి సృష్టించిన ‘ఫేక్ న్యూస్’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ ఆరోపించారు.
ఎలాంటి ఆర్థిక గణాంకాలు లేదా ముందస్తు సంకేతాలు లేని సమయంలో, ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ జరగడం అత్యంత అసాధారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రకటన వెలువడక ముందే ఈ సమాచారం ఎవరికైనా తెలిసిందా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.
READ ALSO: Deva Katta: పవర్ స్టార్‌తో సినిమా.. దేవాకట్టా రియాక్షన్ ఇదే!
తాజావార్తలు
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!