Iran: హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్.. కానీ..
- నౌకలు వెళ్లేందుకు అనుమతిచ్చిన ఇరాన్..
- శత్రుదేశాల నౌకలకు అనుమతి నిరాకరణ..
- ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ సమాధానం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరిపోవడంతో.. ఇది ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.
ట్రంప్ ఏం హెచ్చరించారు?
Also Read
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌కు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను అమెరికా నేలమట్టం చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. కేవలం హెచ్చరించడమే కాకుండా.. మొట్టమొదట ఇరాన్‌లోని అన్నింటికంటే పెద్దదైన పవర్ ప్లాంట్‌పైనే దాడి చేస్తామని బాంబు పేల్చారు. ఇరాన్ తీరు వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలుగుతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:CM Revanth Reddy : మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. ఇకపై అందరూ కోటీశ్వరులే.!
ఇరాన్ సమాధానం ఏమిటి..?
ట్రంప్ హెచ్చరికలపై ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ ప్రతినిధి అలీ మూసవి స్పందించారు. హర్మూజ్ జలసంధి అందరికీ తెరిచే ఉందని, అయితే తమ శత్రువులకు సంబంధించిన నౌకలను మాత్రం అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్‌తో భద్రతాపరమైన ఒప్పందాలు చేసుకుని.. తమకు సహకరించే దేశాల నౌకలు యథావిధిగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఆయన విమర్శించారు. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అని, కానీ దాడులు ఆగిపోయి పరస్పర నమ్మకం ఏర్పడటం అంతకంటే ముఖ్యమని ఇరాన్ వ్యాఖ్యానించింది.
ఎందుకింత రచ్చ..?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇది గనుక మూతపడితే పెట్రోల్, గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే అమెరికా ఈ మార్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తుండగా.. ఇరాన్ తన భూభాగం గుండా వెళ్లే ఈ మార్గాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ప్రస్తుతం ఈ 48 గంటల గడువు సమీపిస్తుండటంతో, ప్రపంచమంతా అప్రమత్తమైంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!