H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa: అమెరికాలోస ఉద్యోగం చేయాలని కంటున్న భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై హెచ్-1బీ (H-1B) వీసా రూపంలో మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై లక్ష డాలర్లకు పైగా ఫీజు భారం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కొత్త రుసుమును ఏకంగా 1,03,265 డాలర్లుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. ఈ భారం కేవలం విదేశాల నుంచి దరఖాస్తు చేసుకునే వారికే పరిమితం కాకుండా, కొత్తగా దరఖాస్తు చేసే దాదాపు అందరు హెచ్-1బీ అభ్యర్థులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సంచలన ప్రతిపాదనను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ‘ఫెడరల్ రిజిస్టర్’లో ప్రచురించింది. ఒకవేళ ఈ ఫైల్‌కు తుది ఆమోదం లభిస్తే, ఈ భారీ ఫీజు నిబంధన శాశ్వతంగా అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది చివరి నాటికే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ప్రక్రియను ముగించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కూడా ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసాలపై తాత్కాలికంగా లక్ష డాలర్ల ఫీజు విధించినప్పటికీ, గతేడాది జూన్‌లో ఒక ఫెడరల్ జడ్జి ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని తీర్పునిస్తూ ఫీజు వసూలును అడ్డుకున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఆ తీర్పును సవాలు చేస్తూ అప్పీలేట్ కోర్టును ఆశ్రయించింది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
అసలు ఏమిటీ హెచ్-1బీ వీసా?
సాంకేతికత, విద్య, పరిశోధన వంటి నైపుణ్యం కలిగిన ప్రత్యేక రంగాలలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు ఈ వీసా ఉపకరిస్తుంది. ఏటా 65 వేల సాధారణ హెచ్-1బీ వీసాలతో పాటు, ఉన్నత విద్య (అడ్వాన్స్డ్ డిగ్రీలు) పూర్తి చేసిన విదేశీయుల కోసం మరో 20 వేల అదనపు వీసాలను కేటాయిస్తారు. సాధారంగా ఈ వీసా వ్యవధి 3 నుంచి 6 ఏళ్ల వరకు ఉంటుంది. ఇప్పటివరకు ఈ వీసా దరఖాస్తు ఫీజు సాధారణంగా 2 వేల నుంచి 5 వేల డాలర్ల మధ్య మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు ఏకంగా 1,03,265 డాలర్లకు పెంచాలనే ప్రతిపాదన కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ అనే చెప్పాలి. అయితే ఈ ప్రతిపాదన నుంచి కొందరికి మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే స్టూడెంట్ వీసా (F-1) పై అమెరికాలోనే ఉంటూ కొత్తగా హెచ్-1బీ వీసాకు మారే విదేశీయులకు అలాగే, ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసాలను రెన్యూవల్ (పొడిగింపు) చేసుకునే వారికి ఈ భారీ ఫీజు వర్తించదు. ఏది ఏమైనప్పటికీ, ఈ నిబంధన గనుక శాశ్వతంగా అమల్లోకి వస్తే విదేశాల నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులను నేరుగా అమెరికాకు తీసుకెళ్లడం అక్కడి కంపెనీలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. ఇది ప్రధానంగా హెచ్-1బీ వీసాలపైనే ఎక్కువగా ఆధారపడే భారతీయ ఐటీ రంగానికి, యువ ఇంజనీర్లకు పెద్ద దెబ్బగానే పరిణమించనుంది.
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!