Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Decision Sparks Inf Treaty Collapse Russia Europe Nuclear Threat

Russia: యూఎస్ బెదిరింపులు.. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం నుంచి రష్యా ఔట్..

Published Date :August 5, 2025 , 9:44 pm
By Shiva Ganesh
Russia: యూఎస్ బెదిరింపులు.. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం నుంచి రష్యా ఔట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈక్రమంలో ఆయన తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఐరోపా దేశాల కొంప ముంచేలా మారింది. రష్యాను బెదిరించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొన్న ఓతొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలను పెద్ద షాక్‌ను గురి చేసింది. ఈ నిర్ణయం కారణంగా మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్‌ (ఇంటర్మీడియట్‌ రేంజి న్యూక్లియర్‌ ఫోర్స్‌ ట్రీటీ) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని, ఈక్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని రష్యా విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఆంక్షలను ఏమాత్రం పాటించబోమని స్పష్టం చేసింది.

READ MORE: Krishna Arrest: లైంగిక వేధింపుల కేసులో మరో డాన్స్ మాస్టర్.. విచారణలో సంచలన విషయాలు..

2019లోనే బయటికి వచ్చిన యూఎస్
రష్యా సుదీర్ఘకాలంగా ఒప్పందం ఉల్లంఘిస్తోందని 2019లో ట్రంప్‌ ఆరోపిస్తూ ఈ ప్లాన్ నుంచి అమెరికాను బయటకు లాగేశారు. 2019లో ట్రంప్ మాట్లాడుతూ.. 9ఎం729 లేదా ఎస్‌ఎస్‌సీ-8 క్షిపణులను రష్యా మోహరించిందని పేర్కొన్నారు. దీనిని అప్పుడు మాస్కో తిరస్కరించింది. ఇటీవల ట్రంప్‌ అణు జలాంతర్గాముల మోహరింపు ఆదేశాలు వెలువరించిన మూడు రోజుల్లోనే రష్యా కూడా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని ప్రకటించింది. అమెరికా (USA) దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్‌ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం దీనికి ప్రధాన కారణంగా వెల్లడించింది.

READ MORE: EPFO New Rule: యూఏఎన్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ టెన్షనే ఉండదు!

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఏంటి?
ఇంటర్మీడియట్‌ రేంజి న్యూక్లియర్‌ ఫోర్స్‌ ట్రీటీగా ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం దానిని వ్యవహరిస్తారు. 1987లో అమెరికా (USA) అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, రష్యా (Russia) అధినేత మిఖాయిల్‌ గోర్బచేవ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజి క్షిపణుల మోహరింపును నిషేధించారు. 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల మధ్యలోవి ఈ ఒప్పంద పరిధిలోకి వస్తాయి. ఈ ఒప్పదం కారణంగా అప్పట్లో రెండు దేశాలకు చెందిన దాదాపు 2,692 క్షిపణలను ధ్వంసం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్‌ రేంజి క్షిపణుల మోహరింపుతో అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలకే ప్రధాన ముప్పు ఉండనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global nuclear security
  • INF agreement collapse
  • intermediate-range missiles
  • nuclear arms race
  • nuclear tension Europe

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions