Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇరాన్ నుంచి చమురు కొనగోలుకు బదులుగా భారత్ వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదర్చుకుందని ఆయన శనివారం చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై న్యూఢిల్లీ నుంచి తక్షణ స్పందన రాలేదు.
భారత్ ప్రస్తుతం అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురును దాదాపుగా నిలిపేసింది. కొద్ది మొత్తంలోనే దిగుమతి చేసుకుంటోంది. గతంలో ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేసేది. ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే, త్వరలో భారత్ వెనిజులా ఆయిల్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, వెనిజులా చమురు కొనుగోలు చేయడానికి చైనా అమెరికాతో చర్చలు జరపొచ్చని ట్రంప్ చెప్పారు.
Read Also: Pakistan: పాక్‌లో “ధురంధర్”ల హవా.. పహల్గాం ఉగ్రదాడి హ్యాండ్లర్ ఖతం..
రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని, అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే, శుక్రవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెలసీ రోడ్రిగ్జ్‌తో మాట్లాడారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
ఒకకప్పుడు భారత్ లక్షలాది బ్యారెళ్ల వెనిజులా ఆయిల్ నున దిగుమతి చేసుకుంది. ఒకానొక సమయంలో వెనిజులా మొత్తం ఎగుమతుల్లో సగం వాటాను కలిగి ఉంది. అయితే, 2010లో యూఎష్ ఆంక్షలు కఠినతరమైన తర్వాత వాణిజ్యం బాగా పడిపోయింది. గత నెలలో వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను అమెరికా దాడులు చేసి, బంధించింది. దీని తర్వాత, వెనిజులా చమురను యూఎస్ కంట్రోల్ చేయడం ప్రారంభించింది.
