Tariffs: ఇంపోర్టెడ్ మీడియం, హెవీ ట్రక్కులపై 25% సుంకం.. ప్రకటించిన ట్రంప్
- ఇంపోర్టెడ్ మీడియం, హెవీ ట్రక్కులపై 25% సుంకం
- ప్రకటించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ టారిఫ్స్ బాంబులను పేల్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ట్రక్కులపై సుంకాలను ప్రకటించాడు. మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ సుంకం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే మొదట దీనిని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్, పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని పంచుకుంటూ, అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విదేశీ పోటీ నుంచి అమెరికన్ తయారీదారులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య వాణిజ్య రక్షణవాదాన్ని ముందుకు తీసుకువెళుతుందని, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుందని ట్రంప్ తెలిపారు.
Also Read:Crime News: తండ్రిని నెట్టేసి.. కన్నతల్లినే హత్య చేసిన కొడుకు
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
అమెరికా కార్మికులను రక్షించడానికి ఈ సుంకాలు అవసరమని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశీయ ట్రక్ తయారీదారులకు మద్దతు ఇవ్వడం ఈ చర్య లక్ష్యమన్నారు. కొత్త సుంకాలు పాక్కర్ (పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్‌లను కలిగి ఉన్నవి) మరియు డైమ్లర్ ట్రక్స్ ఫ్రైట్‌లైనర్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం, జపాన్, యూరోపియన్ యూనియన్‌తో ఉన్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం, అమెరికా తేలికపాటి వాహనాలపై 15 శాతం సుంకాన్ని విధిస్తోంది. అయితే, కొత్త నిర్ణయం తర్వాత ఈ రేటు పెద్ద వాహనాలకు వర్తిస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!