NTV Telugu Site icon

ICC World Cup 2023: వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ తర్వాత జైషాపై ట్రోలింగ్

Jay Sha

Jay Sha

క్రికెట్‌ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదల అయింది. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనున్న మెగా ఈవెంట్ దాదాపు 50 రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. మొత్తం 10 వేదికల్లో గ్రూప్‌ దశలో 48 మ్యాచ్‌లు జరగనుండగా.. నాకౌట్‌ దశలో మూడు మ్యాచ్‌లు ముంబై, కోల్‌కతాలో సెమీఫైనల్‌-1, సెమీఫైనల్‌-2 మ్యాచ్ లు అహ్మదాబాద్‌ లో ఫైనల్‌ మ్యాచ్ జరుగనుంది.

Read Also: ORR Speed Limit : ఓఆర్ఆర్ పై వాహనాల వేగ పరిమితిని పెంచిన హెచ్ఎండీఏ

ఇక ఆరంభమ్యాచ్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ విన్నర్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగనుంది. అయితే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌ మొత్తంగా ఐదు మ్యాచ్‌లకు వేదికగా మారింది. ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లతో పాటు మధ్యలో చిరకాల ప్రత్యర్థులుగా భావించే టీమిండియా-పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లను కూడా ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

Read Also: Asadudiin Owaisi: ప్రధానికి ఆ ధైర్యం ఉందా..? యూసీసీపై ప్రధాని వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్..

ఇక మరో మ్యాచ్‌ సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికి మిగతా నాలుగు మ్యాచ్‌లకు టీఆర్పీ రేటింగ్‌ గట్టిగా వచ్చే అవకాశం ఉంది. కాగా అహ్మదాబాద్‌కు కేటాయించిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఉత్కంఠంగానే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్‌ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో క్లీయర్ గా అర్థం అవుతుంది.

Read Also: Pawan Kalyan: జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతాం

తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో ఆసక్తిని కలిగించే ఐదు మ్యాచ్‌లు జరిగేటట్లు ప్లాన్ చేసుకున్నాడు. అందుకే జై షాను నెట్టింట క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్‌ చేయడంతో పాటు మీమ్స్‌తో రెచ్చిపోయారు. సొంత గ్రౌండ్ లో మంచి మ్యాచ్‌లు పెట్టుకుని.. బయటి వేదికలకు మాత్రం పనికిరాని మ్యాచ్‌లను ఇచ్చాడు అంటూ ఫైర్ అవుతున్నారు. తన ఆధిపత్యం ఎంతలా ఉందనేది క్లీయర్ గా అర్థమవుతుంది.. మోడీ ఉన్నంత వరకు ప్రతిష్టాత్మక మ్యాచ్‌ లు అహ్మదాబాద్‌కే వెళ్తుందన్నది నిజమంటూ నెటిజన్స్ పేర్కొంటున్నారు.

Read Also: Kane Williamson: ప్రపంచకప్ ముందు కివీస్ జట్టుకు గుడ్ న్యూస్.. కేన్ మామ ఈజ్ బ్యాక్

ఈసారి అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగబోయే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేట్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. స్టేడియం సామర్థ్యం లక్ష మందికి పైగా ఉండగా ఈ మ్యాచ్‌కు భారీగా ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వరల్డ్ కప్ లో ఆరంభ మ్యాచ్‌ ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలిమ్యాచ్‌ ఆసక్తిగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా నవంబర్‌ 4న అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌ కూడా మస్త్ క్రేజ్‌ ఉంటుంది. వీటితో పాటు ఫైనల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.