Site icon NTV Telugu

Andhra-Odisha Border: బతికిన.. చచ్చినా ఏపీలోనే.. మాకు ఒడిశా వద్దు..!

Aob

Aob

Andhra-Odisha Border: ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరని కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా బోర్డర్‌ గ్రామాల గిరిజనులు.. మేం ఆంధ్రలోనే ఉంటాం అంటున్నారు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని వివాస్పద గ్రామాలైన నేరాళ్లవలస, దొర్ల తాడివలస, దూళిబంద్ర, ఎగవసెంబి, దిగువ సెంబీ, పణుకులోవ గూడాలకె చెందిన గిరిజనలు నేడు మాజీ డిప్యూటీ సీఎంను కలిశారు.. నిన్న దూళిభద్రకి చెందిన ముగ్గురు గిరిజనలను ఒడిశా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియో ముందు గిరిజనలు తమ గోడు వినిపించారు.. ఆంధ్ర చేపడుతున్న పనులు ఒడిశా ప్రభుత్వం అడ్డగించడంపై గిరిజనలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఒడిశాకు చెందిన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్‌ పుస్తకాలు మన్యం కలెక్టర్ కి అప్పగిస్తామంటున్నారు ఆరు గ్రామాల గిరిజనులు.. అంతేకాదు, తమకు ఒడిశా ప్రభుత్వ పథకాలు వద్దు… బ్రతికిన.. చచ్చినా ఆంధ్రా ప్రభుత్వంలోనే ఉంటామంటున్నారు.. ఒడిశా ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని కోటియా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Khushboo Patani : చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు.. ప్రముఖుల ప్రశంసలు

Exit mobile version