vikarabad resorts : సరదాగా సాగాల్సిన ట్రెజర్ హంట్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వహించిన గేమ్ కారణంగా ఒకరు మృతి చెందారు. బావిలో పడేసిన వస్తువును తీసుకురావడమే ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం.. వివరాళ్లోకి వెళితే.. మూన్ లైట్ రిసార్ట్స్ లో అడ్వెంచర్ గేమ్ నిర్వహించారు. ఈ గేమ్ లో పాల్గొనదలిచిన వారు బావిలో వేసిన వస్తువును బయటకు తీసుకురావాలి. నిన్న సాయంత్రం గోధుమ గుడాలోని మూన్ లైట్ రిసార్ట్స్ కి చేరుకున్న హైదరాబాద్ కు చెందిన యువకులు.. ఈ గేమ్ ఆడారు. అందులో పార్టిసిపేట్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సాయికుమార్ బావిలో పడిన వస్తువును తీసుకొచ్చేందుకు బావిలోకి దిగి మృతి చెందాడు. రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టడంతో బావిలో ఆ వ్యక్తి దూకాడు. అయితే ఆ బావిలో దూకిన వ్యక్తి మృతి చెందాడు.
Read Also: Chegunta: ఆ ఊరికి ఏమైంది.. దీపావళి నుంచి 70మంది గ్రామస్తులకు వాంతులు విరేచనాలు
ఈ ప్రాంతంలో సరైన వెలుగు లేకపోవడం కూడా సాయి కుమార్ మృతికి కారణంగా ఈ గేమ్ లో పాల్గొన్నవారు చెబుతున్నారు. బావిలో దిగిన సాయి కుమార్ ఎంతకీ బయటకు రాకపోవడంతో బావిలో వెతికితే సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. టెక్కీ మృతదేహన్నిపోస్టు మార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిసార్ట్స్ లో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.