Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్.. లక్షా 25 వేలు వసూలు చేసి..!

Ttd 1

Ttd 1

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు పెరిగిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుంచి అధికారులు కేటుగాళ్ల భరతం పడుతున్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు అనతి కాలంలోనే పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు మాత్రం భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బెంగళూరుకు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ శ్రీవారి భక్తులను మోసగించాడు. ప్రత్యేక దర్శనం కల్పిస్తామని చెప్పి.. 36 మంది భక్తులు వద్ద లక్షా 25 వేలు వసూలు చేశాడు. భక్తులకు నకీలి టిక్కెట్లు ఇచ్చి దర్శనంకు వెళ్లమని చెప్పాడు. ఎంతో సంతోషంగా వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు షాక్ తగిలింది. నకీలి టిక్కెట్లతో క్యూలైన్లలోకి వెళ్లిన 36 మంది భక్తులు.. తాము మోసపోయామని గ్రహించారు. ఏజెంట్‌పై పోలీసులకు భక్తులు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Nara Lokesh: అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్‌ పర్యటన.. రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

ఇక వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్స్ అన్ని నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,208 మంది భక్తులు దర్శించుకోగా.. 32,951 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు అని అధికారులు తెలిపారు.

Exit mobile version