Transparent Gulab Jamun: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజు వింత వింత వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక వంటకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు. కొంత మంది తన పైత్యానంతటిని చూపిస్తూ రకరకాల వంటలు చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూస్తే యాక్ అనేలా ఉంటాయి. స్వీట్, హాట్, చాక్లెట్, కారా అనే తేడా లేకుండా వంటకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని చూస్తే నిజంగా బాగున్నాయి అనిపిస్తాయి. కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అనేలా ఉంటాయి. వాటిని తింటే కాదు చూస్తేనే వాంతులు వచ్చేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కొత్త డెజర్ట్ వైరల్ అవుతుంది. అది చూస్తే దానిని కనిపెట్టడానికే అరగంట పడుతుంది.
Also Read: Guinness World Record : ఇదో వింత స్టోరీ.. నిద్రలో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాలుడు
దీనిని టెస్ట్ థిస్ బెంగళూరు(tastethisbangalore)అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది చూడటానికి గులాబ్ జామ్ లాగా ఉంది. కానీ అది మనం సాధారణంగా చూసే, తినే గులాబ్ జామ్ కాదు. అంతకు మించి. పైన గులాబ్ జామ్ లా ఉన్న దాని కింద ఏదో ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తోంది. అయితే వీడియోలో మాత్రం దీనిని ‘ ట్ట్రాన్స్పరెంట్ గులాబ్ జామూన్’ అని పేర్కొన్నారు. అంతే కాకుండా తాల్ సే తాల్ మిలా అని కూడా రాశారు. ఇది చూసిన వారు ఇది అసలు గులాబ్ జామా? ఐస్ క్యూబా అని గందరగోళానికి గురవుతున్నారు. అయిన ట్రాన్స్పరేంట్ గా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. వీడియోని కనుక మనం గమనించినట్లయితే ఒక ప్లేట్ లో ట్రాన్స్పరేంట్ గా ఐస్ క్యూబ్ లాగా ఉండే ఒకదానిపైన మనం సాధారణంగా చూసే గులాబ్ జామ్ ఉంది. దాని చుట్టూ ఏదో లిక్విడ్ మసాలా లాగా ఏదో పదార్థం ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు దీనికి లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఇలాంటి ఫుడ్ ఐటమ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది దీనిని రెయిన్ డ్రాప్ కేక్ అని పేర్కొంటున్నారు. ఇంతకీ ఇదేంటో క్లియర్ గా మాత్రం తెలియలేదు. మీరు కూడా దీన్ని చూసి ఏమని పిలవాలో ఒకసారి ఆలోచించండి మరి.