Guinness World Record : ఇదో వింత స్టోరీ.. నిద్రలో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guinness World Record: కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు నిద్ర మధ్యలో తమకు తెలియకుండానే లేచి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఏం చేశారో కూడా గుర్తుండదు. సాధారణంగా ఇలాంటి వారు ఇంటిలోనో, ఇంటి చుట్టు పక్కలో తిరుగుతూ ఉంటారు. అయితే ఓ బాలుడు మాత్రం నిద్రలో ఏకంగా 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ సంఘటనను రికార్డుల్లో వేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన స్టోరీని కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసుకుంది.
Also Read: Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
వివరాల్లోకి వెళ్తే..మైఖేల్ డిక్సన్ అనే బాలుడుకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అతడు తరచూ తన ఇంట్లోనిద్రలో నడిచేవాడు. అయితే 1987 ఏప్రిల్ 6 న మైఖేల్ డిక్సన్ అమెరికాలోని పెరూ, ఇండియానాలో రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతూ కనిపించాడు. అప్పుడు అతడు చెప్పులు లేకుండా నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. దాదాపు తెల్లవారు జామున 2.45 గంటలకు అతడిని రైల్వే సిబ్బంది మైఖేల్ గుర్తించాడు. అతని గురించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. పోలీసులు అతనిని అడ్రస్ గురించి అడిగితే ఇల్లినాయిస్ లోని డాన్ విల్లే నుండి వచ్చానని చెప్పాడట. అయితే ఇక్కడి ఎలా వచ్చావని అడిగితే నిద్రలో నడుచుకుంటూ తన ఇంటికి సమీపంలోని స్టేషన్ నుండి గూడ్స్ రైలు ఎక్కి వచ్చానని తెలిపాడట. డిక్సన్ నిద్రలోనే 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే రైలు ఎక్కింది, ఇంత దూరం ప్రయాణించింది ఏవి తనకు గుర్తులేవని డిక్సన్ తెలిపాడు. అతని అసాధారణ పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు అతని తల్లికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న డిక్సన్ తల్లి తన కొడుకు ఇంటిని దాటి ఇంత దూరం వస్తాడని అనుకోలేదని తెలిపింది. అయితే అంత నిద్రలో ప్రయాణించినా డిక్సన్ క్షేమంగానే ఉన్నాడు. అప్పుడు అతని వయసు 11 యేళ్లు మాత్రమే. ఈ వింత కేసును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఖాతాలో నమోదు చేసుకోవడమే కాదు ఈ స్టోరిని స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సంవత్సరాలుగా నిద్రపోని వారిని, గురక శబ్దం చేసేవారిని, పెద్దగా ఆవలించడం, ఎక్కువగా కోమాలో ఉన్న ఘటనలను నమోదు చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిద్రలో నడవడం కూడా నమోదు చేశామని వెల్లడించింది. నిద్రలో నడవడం ఒక సమస్య అయినప్పటికీ దానితో కూడా రికార్డు క్రియేట్ చేశాడు మైఖేల్ డిక్సన్.
Our 1989 edition of Guinness World Records featured the story of Michael Dixon, who managed to sleepwalk onto a freight train and end up 100 miles from home.https://t.co/vs1x9L4F7d
— Guinness World Records (@GWR) August 22, 2023
తాజావార్తలు
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!