NTV Telugu Site icon

Uttarakhand: ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌.. 16 మంది మృతి

Uttarakhand

Uttarakhand

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి విచారణకు ఆదేశించారు. గంగా నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు 36 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో.. గంగా నది పునరుద్ధరణ కోసం 36 మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో ఆమోదించింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) ప్రకారం.. దాని ఫ్లాగ్‌షిప్ ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ ద్వారా, రాష్ట్రంలోని ప్రతి గంగా నదికి స్వచ్ఛమైన నీరు వచ్చేలా కేంద్రం బహుముఖ ప్రయత్నం ద్వారా మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది.

Bro Ticket Rates: మొత్తానికి భలే సెట్ చేశారు ‘బ్రో’

ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కరెంట్ షాక్ తో ఓ వాచ్‌మెన్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది స్పాట్ ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్ళారు. ఆ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులతో సహా దాదాపు 16 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. రైలింగ్‌లో కరెంట్ ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. దర్యాప్తు తరువాత మిగతా వివరాలు తెలుస్తాయి అని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

Viral Video: ఢిల్లీ మెట్రోలో యువతి విన్యాసాలు..దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..

మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీం సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నామని, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇంధన కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.