Site icon NTV Telugu

IPS: ప్రభుత్వం కీలక నిర్ణయం.. 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు..

Ips

Ips

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏకంగా 20మంది ఐపీఎస్ లను బదిలీ చేసి పోస్టింగ్స్ ఇచ్చింది. డా. గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్‌గా నియామకం అయ్యారు. అదనంగా IG – స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్‌చార్జ్ గా నియమితులయ్యారు. అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ DIG గా బదిలీ అయ్యారు. ఆర్. భాస్కరన్ (IPS 2012) CI సెల్ SP నుంచి DIG, CI సెల్ – ఇంటెలిజెన్స్ గా బదిలీ అయ్యారు. జి. చందనా దీప్తి (IPS 2012) రైల్వేస్ SP/DIG నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ & ట్రాఫిక్) గా బదిలీ అయ్యారు.

Also Read:iPhone 17 సిరీస్‌ లాంటి లుక్.. రూ.9 వేలకే సొంతం చేసుకోవచ్చు..

టి. అన్నపూర్ణ (IPS 2013) విజిలెన్స్ SP నుంచి సైబరాబాద్ DCP (అడ్మిన్)గా బదిలీ అయ్యారు. బి.కే. రాహుల్ హెగ్డే (IPS 2014) హైదరాబాద్ ట్రాఫిక్ DCP నుంచి ట్రాఫిక్–III DCP గా బదిలీ అయ్యారు. కె. అపూర్వా రావు (IPS 2014) ఈస్ట్ జోన్ DCP నుంచి ఇంటెలిజెన్స్ SPగా బదిలీ అయ్యారు. బాల స్వామి (IPS 2018) ఈస్ట్ జోన్ DCP నుంచి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ SPగా బదిలీ అయ్యారు. ఆర్. వెంకటేశ్వర్లు (IPS 2018) ట్రాఫిక్–III DCP నుంచి CID SPగా బదిలీ అయ్యారు. ఎస్. చైతన్య కుమార్ (IPS 2020) సౌత్ ఈస్ట్ జోన్ DCP నుంచి క్రైమ్స్ DCP, హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.

Also Read:Kangana : మీలాంటి ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు.. రెహమాన్’పై కంగనా సంచలనం

అవినాష్ కుమార్ (IPS 2021) అడిషనల్ SP (ఆపరేషన్స్), కొత్తగూడెం నుంచి ట్రాఫిక్–I DCP, హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. కాజల్ (IPS 2021)
ఉట్నూర్ ASP నుంచి ట్రాఫిక్–II DCP, హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. శేషాద్రిని రెడ్డి (IPS 2021) జగిత్యాల అడిషనల్ SP నుంచి ట్రాఫిక్–II DCP, సైబరాబాద్ కు బదిలీ అయ్యారు. కంకనాల రాహుల్ రెడ్డి (IPS 2021) భువనగిరి ASP నుంచి ట్రాఫిక్–I DCP, మల్కాజ్‌గిరికి బదిలీ అయ్యారు. శివమ్ ఉపాధ్యాయ (IPS 2021) ములుగు అడిషనల్ SP నుంచి ట్రాఫిక్ DCP, ఫ్యూచర్ సిటీకి బదిలీ అయ్యారు. శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలు కూడా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version