Nak*ed : మన సమాజంలో రోజు రోజుకీ ఏదో ఒక విచిత్ర ఘటన మన ముందుకు వస్తోంది. కొన్ని సంఘటనలు విని అవాక్కవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఒక ఆఘాతకరమైన, నమ్మశక్యంకాని ఘటన వెలుగులోకి వచ్చింది. “నా భర్త థర్డ్ జండర్‌గా వేషం వేసుకుని అశ్లీల వీడియోలు తీయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు” అంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంతో కబీర్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ వైద్యుడైన డా. వరుణేశ్ దుబే భార్య సింపి పాండే చేసిన ఆరోపణలతో స్థానికంగా హల్చల్ అయింది. తన భర్త తలపై విగ్ పెట్టుకుని, చీర కట్టుకుని స్త్రీ మాదిరిగా వేషం వేసి ఇతర పురుషులతో కలిసి అశ్లీల వీడియోలు తీసి, ఆన్లైన్లో పోస్టు చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, ఈ వీడియోలు డబ్బు కోసం వివిధ వెబ్ ప్లాట్‌ఫార్మ్స్‌పై అప్లోడ్ చేస్తున్నాడని ఆరోపించారు.
Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది.. ఇందిరా గాంధీపై విమర్శలు..
ఈ ఆరోపణలతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సింపి పాండే, తన భర్తపై వివాహ బంధానికి మోసం చేసినందుకు, మానసిక వేధింపులకు గురి చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అయితే ఈ ఆరోపణలపై తన భర్త వరుణేశ్ దుబే మాత్రం పూర్తిగా తిరస్కరించారు. తన భార్యే తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి, తనను బ్లాక్మెయిల్ చేస్తోందని పేర్కొన్నారు. ఆమె బంధువు ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడంతో డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన ముఖాన్ని జోడించి నకిలీ వీడియోలు తయారు చేసి తన పరువు తీయాలని కుట్ర పన్నిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. డొమస్టిక వయిలన్స్, సైబర్ నేరాలు, ఎఐ టెక్నాలజీ దుర్వినియోగం వంటి అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. నిజంగా వీడియోలు తీయబడ్డాయా? అవి డీప్ ఫేక్ వెర్షన్‌లా? ఎవరు ఏ మోతాదులో సత్యం చెబుతున్నారు.? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Lion Attack: సింహానికి టచ్ ఇచ్చాడు.. వెంటనే స్ట్రెచర్ ఎక్కాడు..!