Train Incident: ఎందుకురా ఇలా చేస్తున్నారు.. మరోమారు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు
- గ్వాలియర్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది.
- రైలు పట్టాలపై ఇనుప రాడ్ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం.
- ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ దగ్గర కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Incident: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ రైలు పట్టాలపై ఇనుప రాడ్ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై రైల్వే, గ్వాలియర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన గురించి బిర్లా నగర్ రైల్వే స్టేషన్, గ్వాలియర్ రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు రైలు సంబంధిత అధికారులు. రైల్వే సిబ్బందితో పాటు గ్వాలియర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి గుర్తు తెలియని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Also: Minister Komatireddy: రైతులకు గుడ్ న్యూస్.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ!
Also Read
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
ఇక మరోవైపు ప్యాసింజర్ రైలును పట్టాలు తప్పించే కుట్రలో భాగంగా.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ దగ్గర జగత్పూర్-దరియాపూర్ స్టేషన్ మధ్య బెనికామా గ్రామ సమీపంలో సిమెంట్ స్లీపర్‌ను పూడ్చిపెట్టారు. అయితే., ప్యాసింజర్ రైలు కంటే ముందే గూడ్స్ రైలు వచ్చింది. ఇది గమనించిన లోకో పైలట్ బ్రేక్ వేసి రైలును నిలిపివేశాడు. దింతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ప్రయాగ్‌రాజ్ రాజేష్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిమెంట్ స్లీపర్‌లన్నింటినీ తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. లక్నో స్థాయి నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్ఎం శర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!