NTV Telugu Site icon

Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్‭లో..

Sim Blocked

Sim Blocked

Trai New Rule: అవాంఛిత కాల్స్ (స్పామ్ కాల్స్) వల్ల ఉత్పన్నమయ్యే మోసం కేసులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) స్పామ్ కాల్‌ లను నిషేధించడానికి కొత్త నిబంధనను రూపొందించింది. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం, ఎవరైనా ప్రైవేట్ మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆ నంబర్‌ను 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ చేస్తుంది.

China: ఇజ్రాయిల్‌తో ఉద్రిక్తతల నడుమ ఇరాన్‌కి మద్దతు ప్రకటించిన చైనా..

కొంత కాలంగా స్పామ్ కాల్స్ పేరుతో మోసం జరుగుతోందని.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండగా, ఈ నేపథ్యంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. టెలిమార్కెటింగ్‌కు సంబంధించి TRAI కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్, బీమా రంగం 160 నంబర్ సిరీస్ నుండి మాత్రమే ప్రచార కాల్‌లు, సందేశాలను చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా జనరేట్ చేయబడిన కాల్‌లు/రోబోటిక్ కాల్‌లు, మెసేజ్‌లు కూడా కొత్త రూల్‌లో చేర్చబడ్డాయి. తద్వారా వినియోగదారులు అవాంఛిత కాల్‌లు, సందేశాలను తొలగిస్తారు.

Medchal: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డేటా ప్రకారం.. గత 3 నెలల్లో 10,000 కంటే ఎక్కువ మోసపూరిత సందేశాలు పంపబడ్డాయి. దీంతో స్పామ్ కాల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అలాంటి కాల్స్, మెసేజ్‌ల వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, మీరు ‘సంచార్ సతీ పోర్టల్’ లో ఫిర్యాదు చేయవచ్చు. మీరు మీ ఫిర్యాదును 1909 నంబర్‌లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా కూడా వాటిని నుండి బయట పడవచ్చు.

Show comments