Accident : పెద్దఅంబర్ పేట్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో రిత్విక LKG చదువుతోంది. అయితే.. రోజులాగే ఈ రోజు కూడా బాలిక బస్సు దిగింది. అయితే.. బాలిక దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడం ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె మరణ వార్తతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Upasana: పిల్లల్ని కనే విషయంలో ఆధునికతను అనుసరించండి : ఉపాసన