Insta Reels: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ చాలా మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రీల్స్ చేస్తూ ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై రీల్స్ వేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలతో పాటు వారి మూడేళ్లు కొడుకు కూడా చనిపోయాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24) భార్యాభర్తలు. వీరికి అబ్దుల్లా అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. లఖింపూర్ ఖిరి జిల్లాలోని హర్‌గావ్ సమీపంలోని క్యోతి అనే గ్రామంలో జరిగిన శుభ కార్యక్రమానికి అహ్మద్ తన భార్య , కొడుకుతో కలిసి హాజరయ్యారు. బుధవారం ఉదయం ముగ్గురు సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చారు.
Read Also:Duleep Trophy 2024: నేటి నుంచే రెండో రౌండ్.. అందరి దృష్టి శ్రేయస్‌పైనే!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం వారికి అలవాటు. ఇంటి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు ముగ్గురు బైక్‌పై వచ్చారు. ఆ తర్వాత అహ్మద్, నజ్రీన్, అబ్దుల్లా ట్రాక్స్‌పైకి వచ్చి రీల్స్ చేశారు. రీళ్ల లోకంలో మునిగితేలుతున్న వారు తమ వెనుకే రైలు వస్తున్నట్లు గమనించలేదు. రీల్స్ చేస్తున్న వారిలో ముగ్గురిని లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. వేగంతో రైలు ఢీకొనడంతో ముగ్గురు రైలు పట్టాలపైనే మృతి చెందారు. వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పక్కనే సెల్ ఫోన్ కనిపించింది. ఫోటోలు, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Kolkata : సంజయ్ రాయ్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఇద్దరు పోలీసులను విచారించిన సీబీఐ