NTV Telugu Site icon

Sad News : మానవత్వంలేని మనుషులు.. శవం దుర్వాసన వచ్చేదాక సోయిలేదా?

Tragedy

Tragedy

నేటి సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే.. మనుషులు ఇంతగా దిగజారిపోయారా అనిపిస్తుంది. తమ ప్రాణాలకు ఇచ్చే విలువలో పక్కవారి ప్రాణాలపై ఒక శాతం కూడా ఉండదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. యాక్సిడెంట్‌ జరిగి ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మరణించి పదిరోజులైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరికి మృతదేహాం నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయవిదాకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో 13 రోజులుగా శవం కుళ్లిపోయింది. గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (28) అనే యువకుడు గాయపడ్డాడు. అయితే.. ఇది గమనించి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. హాస్పిటల్‌కి తరలించి పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు, 108 సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు.. అయితే.. చికిత్స పొందుతూ డిసెంబర్ 23న శ్రీనివాస్‌ మృతి చెందాడు.

Also Read : Elephant Video Viral : రోడ్డుపై బైక్ పెడతారా బుద్ధిలేదు.. తన్ని అవతలేసిన ఏనుగు

శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆసుపత్రి వైద్యులు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చురీలోనే శ్రీనివాస్ డెడ్ బాడీ ఉంది. ప్రతి రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాన్డ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు డెడ్ బాడీ దుర్వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. అయితే.. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డ్ ఆధారంగా శ్రీనివాస్ ది ఝారసంఘం మండలం కిష్టపూర్ గ్రామంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆస్పత్రికి హుటాహుటిన వచ్చిన బంధువులు.. పుల్కల్ పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీ తీసుకెళ్లడానికి నిరాకరించిన బంధువులు.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాస్ బంధువులు. రేపు ఆసుపత్రి ముందు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments