Site icon NTV Telugu

Uppal Bhagayat: పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..!

Uppal

Uppal

Uppal Bhagayat: హైదరాబాద్‌ నగర శివారులోని ఉప్పల్ భాగాయత్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతిచెందిన బాలురు అర్జున్ (8) కాగా, మరొకరు మణికంఠ (15)గా అదిరికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతో పాటు వలస వచ్చిన ఈ చిన్నారులు, ఉప్పల్ లోని కుర్మానగర్ ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా జీవనోపాధి కోసం పనిచేస్తున్నారు. కాగా, ఈ ఇద్దరు చిన్నారులు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోగా.. కుటుంబసభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.

Read Also: Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్‌ లాంచ్..!

రాత్రి నుండి పోలీసులు గాలింపు చేపట్టగా.. ఇవాళ ఉదయం భాగాయత్‌లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత చాలాసేపు అనంతరం మరొక బాలుడు మణికంఠ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు ఆ గుంత వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడ్డారా? లేక మరేదైనా అనుమానాస్పద అంశముందా? అనే దానిపై స్పష్టత కోసం విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలానికి హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళం చేరుకుని గల్లంతైన మణికంఠ కోసం వెతికే చర్యలు కొనసాగిస్తున్నారు.

Exit mobile version