Uppal Bhagayat: పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Bhagayat: హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్ భాగాయత్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతిచెందిన బాలురు అర్జున్ (8) కాగా, మరొకరు మణికంఠ (15)గా అదిరికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతో పాటు వలస వచ్చిన ఈ చిన్నారులు, ఉప్పల్ లోని కుర్మానగర్ ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా జీవనోపాధి కోసం పనిచేస్తున్నారు. కాగా, ఈ ఇద్దరు చిన్నారులు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోగా.. కుటుంబసభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
Read Also: Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్ లాంచ్..!
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
రాత్రి నుండి పోలీసులు గాలింపు చేపట్టగా.. ఇవాళ ఉదయం భాగాయత్‌లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత చాలాసేపు అనంతరం మరొక బాలుడు మణికంఠ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు ఆ గుంత వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడ్డారా? లేక మరేదైనా అనుమానాస్పద అంశముందా? అనే దానిపై స్పష్టత కోసం విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలానికి హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళం చేరుకుని గల్లంతైన మణికంఠ కోసం వెతికే చర్యలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!