NTV Telugu Site icon

Tamil Nadu: తమిళనాడులో విషాదం..కల్తీసారా 18 మంది మృతి..

New Project (17)

New Project (17)

తమిళనాడులో విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స 60 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 25 మంది సీరియస్ గా ఉన్నారు. మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది. కల్లకూరిచి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని… రాష్ట్రంలో కల్తిసారా అడ్డాగా మారిందని మాజీ సీఎం పళణి స్వామీ విమర్శించారు.

READ MORE: Eyes Care Tips: కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

READ MORE: Bandi Sanjay Kumar: కేంద్రంలోనూ వేముల వాడ రాజన్న ఆలయ విశిష్టతపై చర్చ

ఈ కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జాదావత్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎంఎస్ ప్రసాద్‌ను నియమించారు. జిల్లా ఎస్పీ సమై సింగ్ మీనాని కూడా తొలగించి, రజత్ చతుర్వేదికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని టీమ్‌ను సస్పెండ్ చేశారు. మంత్రులు ఈవీ వేలు, ఎం సుబ్రమణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రిని సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.