Ganesh Immersion: కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వియన్‌పల్లి మండలంలోని మొగమూరు వాగులో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇద్దరు యువకులు వాగులో గల్లంతు కావడంలో వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: Tragedy: బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
ఇదిలా ఉండగా.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వినాయక నిమజ్జనంలో మరో ఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తెలుగు గంగ కాలువ వద్దకు నలుగురు బాలురు వెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా అదుపుతప్పి కాలువలో నలుగురు జారిపడ్డారు. వీరిలో ముగ్గురిని టోల్‌గేట్ సిబ్బంది రక్షించగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. దస్తగిరి కుమారుడూ లాల్ భాషా(12) గల్లంతైనట్లు తెలిసింది. కాల్వకట్ట వెంబడి లాల్ బాషా ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్థులు గాలిస్తున్నారు. ఇంకా అతడి ఆచూకీ తెలియరాలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.