NTV Telugu Site icon

Hyderabad Traffic: బక్రీద్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ఏరియాకు వెళ్లొద్దు

Hyd Traffic Restrictions

Hyd Traffic Restrictions

బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని రేపు మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ నుంచి ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను బహదూర్‌ఫురా ఎక్స్‌ రోడ్డు మీదుగా రావాలని తెలిపారు. వీరు తమ వాహనాలను జూపార్కు ఏరియాలో, ఓపెన్‌ స్పేస్‌ ఎదురుగా మసీదు అల్లాహో అక్బర్‌ వద్ద పార్క్‌ చేసుకోవాలని సూచించారు.

Read Also: Jagananna Amma Vodi: కురుపాంలో సీఎం పర్యటన.. నేడే వారి ఖాతాల్లో రూ.13 వేలు జమ

ఈ టైంలో సాధారణ వాహనాల రాకపోకలకు పర్మిషన్ లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరిని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపురా, పురానాపూల్‌ వైపు దారి మళ్లించామని అని చెప్పారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్‌ నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను దాన్నమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతి ఉంటుంది. వీరు తమ వాహనాలను ఈద్గా ప్రధాన రహదారి ముందు, మోడ్రన్‌ సా మిల్‌ పార్కింగ్‌తో పాటు మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, మీరాలం బెడ్‌ పక్కన ఖాళీ ప్లేస్ లో, కార్లను, యాదవ్‌ పార్కింగ్‌ పక్కన పార్క్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ టైంలో ఇతర వాహనాల రాకపోకలను ఈద్గా వైపు పర్మిషన్ లేదన్నారు.

Read Also: WhatsApp LPG Gas Booking: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్‌ ఇంటికి వచ్చేస్తుంది!

సాధారణ వెహికిల్స్ ను దానమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు దగ్గర శాస్త్రిపురం, నవాబ్‌సాబ్‌కుంట తదితర ప్రాంతాల నుంచి దారి మళ్లించనున్నట్లు నగర పోలీసులు తెలిపారు. కాలాపత్తర్‌, మీరాలం ట్యాంక్‌ వైపు నుంచి వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతించమన్నారు. వీరు తమ వాహనాలను భయ్యా పార్కింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద పార్క్‌ చేసుకోవాలని సూచించారు. సాధారణ వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మోచీ కాలనీ, బహదూర్‌పురా, షంషీర్‌గంజ్‌, నవాబ్‌సాబ్‌కుంట వైపు మళ్లించారు.

Read Also: Big Pay Hike: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!

పురానాపూల్‌, బహదూర్‌పురా వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలను పురానాపూల్‌ దర్వాజా వద్ద జియగూడ, సిటీ కాలేజీ వైపు దారి మళ్లించనున్నారన్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను ఆరాంఘర్‌ జంక్షన్‌ దగ్గర శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి వైపు దారి మళ్లించనున్నారు.