Site icon NTV Telugu

Hyderabad Traffic: హైదరాబాద్ లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions

Traffic Restrictions

తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ రూట్​లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Read Also: Janasena: ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేనకు ఆహ్వానం

ఇవాళ ఉదయం 6 గంటల నుంచి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు పలు రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయని సిటీ పోలీసులు తెలిపారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వెహికిల్స్ ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ-తార్నాక-అడిక్‌మెట్-విద్యా నగర్-ఫీవర్ హాస్పిటల్- టీవై మీదుగా మళ్లీస్తున్నారు. మండలి-టూరిస్ట్ హోటల్ జంక్షన్-నింబోలిఅడ్డ-చాదర్‌ఘాట్, సీబీఎస్ రిటర్న్ వచ్చే రూట్లలో వైస్ వెర్సాగా ఉంటుంది.

Read Also: Wine Shops: తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్..

కోఠి నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వెహికిల్స్, సిటీ బస్సులు నింబోలిఅడ్డ-టూరిస్ట్ హోటల్-టీవై మండలి-ఫీవర్ హాస్పిటల్ అడిక్‌మెట్-తార్నాక-హబ్సిగూడ-ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో దారి మళ్లీస్తున్నారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ – మల్లికార్జున నగర్ – డిడి కాలనీ – సిండికేట్ బ్యాంక్ శివం రోడ్ వైపుకు దారి మళ్లీంచారు. గోల్నాక, మూసారాంబాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్‌ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసుల పేర్కొన్నారు. అంబర్‌పేట్ – సల్దానా గేట్ – అలీ కేఫ్ X రోడ్లు, తిరుగు మార్గంలో వైస్ వెర్సా వైపుకు పంపిస్తున్నారు.

Read Also: LIVE : ఆషాఢ ఆదివారం నాడు ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య బాధలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి

అయితే, ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సిటీ పోలీసులు ప్రజలకు తెలియజేశారు. కాగా, ఈ రెండు రోజులు కూడా హైదరబాద్ నగరంలో మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం రోజునే మద్యం షాపుల ముందు భారీగా మందుబాబులు మద్యం కొనుగోలు చేశారు.

Exit mobile version