Bengaluru Traffic: ట్రాఫిక్ కష్టాలు.. కారులోనే వంటకి రెడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇది చూస్తుంటే బెంగళూరులో ట్రాఫిక్ తారాస్థాయికి చేరుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీనికి అద్దం పట్టే ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజెప్పే రెండు ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఘటనలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న ఓ మహిళ అక్కడే కూరగాయలు కూడా ఒలుచుకుంది.
Also Read: ICC World Cup: సరికొత్త హంగులతో.. ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన నిరసనను తెలియజేసింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ట్రాఫిక్‌లో వంట కూడా చేసుకోవచ్చని వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. మరో ఘటనలో బెంగుళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్న వ్యక్తికి గూగుల్ నుంచి ఓ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ‘మీ షాపింగ్ అనుభవం ఎలా ఉంది?’ అని ఉంది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్‌మాల్ పక్కన ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడంతోనే ఈ మెసేజ్ వచ్చింది. అంటే ఆయన షాపింగ్ చేసే అంత టైం ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలా బెంగళూరు వాసులు సగం జీవితం ట్రాపిక్ లోనే అయిపోతుంది. అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ పదవుల కోసం, ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే ఇలాంటి కష్టాలు కొంచెం అయినా తగ్గుతాయని, వీటి మీద శ్రద్ద చూపాలని ప్రజలు మండిపడుతున్నారు.
- Tags
- bangalore
- traffic
- viral photos
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!