Dhanush: మంచి స్పాట్‌లో లేదా పుణ్యక్షేత్రాల్లో సినిమా షూటింగ్‌లు, వెబ్ సిరీస్‌లు షూటింగ్‌లు నిర్వహించే సాదారణ విషయమే.. కానీ, అవి భక్తులకు ఇబ్బంది కలిగించేలా ఉంటేనే.. ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడు తమిళనటుడు ధనుష్ నటిస్తోన్న.. వెబ్ సిరీస్ షూటింగ్‌కు అనుమతించిన అధికారులు.. ట్రాఫిక్ మళ్లించారు.. దీంతో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.. కపిల్ తీర్థం ద్వారా తిరుమలకు వెళ్లాల్సిన అన్ని వాహనాలను దారి మళ్లించారు అధికారులు.. ట్రాఫిక్ మళ్లింపు కోసం పోలీసులతోపాటు భారీగా బౌన్సర్ల మొహరించారు.. ఇరుకైన హరే రామ హరే కృష్ణ రోడ్ లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. అయితే, తిరుమల శ్రీ వెంకన్న దేవుడి వద్దకు వెళ్లే వారిని ఆపి షూటింగ్ కు అనుమతించడం ఏంటి..? వీరికి మరెక్కడా చోటు దొరకలేదా అంటూ మండిపడుతున్నారు భక్తులు.
Dhanush: ‘ధనుష్’ షూటింగ్ కోసం ట్రాఫిక్ మళ్లింపు.. తిరుమలకు వెళ్లే భక్తులకు కష్టాలు

Dhanush