TPCC Mahesh Goud : మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు.. పేదలు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వల్లనే అదానీ దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా అదానీ కుంభకోణం బయట పడిందని, మన రాష్ట్రంలో కొంతమంది పెద్దలకు ముడుపులు అందాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. అర్హత లేకుండా అదానీ కంపనీ రుణాలు పొందిందని, అదానీ అరెస్టు ఐతే ప్రధాని మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మోడీ వచ్చాకా.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం బాసటగా ఉండటం వల్లనే ఆస్తులు పెరిగాయని, అదానీ వ్యవహారం పై జేపీసీ వేయాలని మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్ కూడా స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఇస్తా అంటే తీసుకుంటామని, అదానీ వంద కోట్లు స్కిల్ యూనివర్సిటీ కి ఇచ్చారన్నారు.
Mumbai 26/11 attack: భారత్‌కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నామని, మేం కుదుర్చుకున్న ఒప్పందం చట్ట విరుద్ధం ఐతే వెనక్కి తీసుకుంటామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ జేపీసీ అడుగుతున్నారని మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్.. బీజేపీ వేరు కాదని, బీజేపీ.. బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని ఆయన అన్నారు. కేటీఆర్ కి సన్నిహిత ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్ లో ఉన్నారని, చాలా మంది క్యూ కడతారన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి నీ చూసి పార్టీ లోకి రావాలని చూస్తున్నారని, అనర్హత వేటు నిర్ణయం స్పీకర్ పరిధి అని, చట్టం ప్రకారం వ్యవహరిస్తారన్నారు. ఎవరెవరు పార్టీలో చేరతారు అనేది త్వరలోనే తెలుస్తోందన్నారు మహేష్ గౌడ్.
Komatireddy Venkat Reddy : కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి