Site icon NTV Telugu

TPCC Mahesh Goud : తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు..

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ కు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందన ఆయన మండిపడ్డారు. బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరణాలు ఇచ్చారని, బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపిస్తుంది… రాజకీయంగా తెలంగాణ ను దెబ్బతీయలని చూస్తుందన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని, త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందన్నారు.

Gaurav Gogoi: గత పదేళ్లలో అత్యంత బలహీన బడ్జెట్ అంటే ఇదే..

దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికి సమానంగా ఇవ్వాలని, నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు గారి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా అని ఆయన అన్నారు. తెలంగాణ కు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ లు కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణ కు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేసారన్నారు.

అంతేకాకుండా..’రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐ.టి.ఐ.ఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి.. రాష్ట్రం నుంచి 40 వేల కోట్ల జిఎస్టీ రూపాయలు కేంద్రానికి వెళ్తున్నాయి.. మరి ఆ మేరకు అయిన తెలంగాణ కు కేంద్రం నుంచి నిధులు రావాలి కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో ఉన్నదని బీజేపీ వివక్ష చూపడం అన్యాయం. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ కు అవసరమైన అంశాలలో సహకారాన్ని అందించాలి..’ అని మహేష్ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Google Maps: కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. లోయలోకి భారీ కంటైనర్..

Exit mobile version