TPCC Mahesh Goud : రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీస్కెళ్లాలన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపైన విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలి. అందుకు తగ్గట్టు మన ప్రచారం ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక మందికి కార్పొరేషన్ల పదవులు వచ్చాయని, డీసీసీ అధ్యక్షులకు అందరికి పదవులు వచ్చాయన్నారు. అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు వచ్చాయని, ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని, రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పార్టీ అన్ని విధాలుగా గట్టిగా కృషి చేయాలన్నారు. మంచి ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.
Satya Dev: ‘జీబ్రా’ నా అదృష్టం..కొత్త ఎక్స్ పీరియన్స్ : హీరో సత్యదేవ్