NTV Telugu Site icon

Revanth Reddy: మూరెడు లేడు కానీ.. మూసిని మింగిండు…

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నీళ్లు జగన్ తీసుకెళ్లిండు, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ తీసుకెళ్లారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్‌ బహిరంగ సభలో రేవంత్‌ ప్రసంగించారు. నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయి తప్ప నిరుద్యోగుల కష్టాలు తీరలేదన్నారు. మనుమడిని మంత్రిని చేసేటందుకే కేసీఆర్ మూడోసారి అవకాశం ఇవ్వాలంటున్నారని విమర్శించారు. పది ఎకరాల్లో నిర్మించుకున్న కేసీఆర్ గడీలోకి పేదలకు ప్రవేశం లేదని.. పేదోడి చెమట వాసన ఎట్లుంటదో కేసీఆర్‌కు తెలియదన్నారు. నన్ను రానివ్వకపోయినా సరే.. అమరుల కుటుంబాలకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదన్నారు. గద్దరన్నను కూడా లోపలికి రానీయకుండా ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లోపల అతిథి మర్యాదలు… మనం మాత్రం ఎర్రటి ఎండలో మగ్గిపోవాలా? అంటూ ప్రశ్నించారు.

Also Read: Kichannagari Laxma Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాం..

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు..ఇక్కడ ఎమ్మెల్యే మూరెడు లేడు కానీ.. మూసిని మింగిండు.. కేసీఆర్‌కు సారా పోసే వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నడు. నాడు రాజాకార్లను తరిమిన చరిత్ర నల్లగొండది… అలాంటి ఇక్కడ కేసీఆర్‌కు సీసాలో సారా పోసేవారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న పరిస్థితి దాపురించింది. ఇలాంటి వాళ్లతో నల్లగొండ ఆత్మగౌరవం నిలబడుతుందా?. తుంగతుర్తి నుంచి కేసీఆర్‌కు ఒక మాట ఇవ్వదలచుకున్నా.. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం తెచ్చి చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం… ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది. కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో అత్యవసర సమావేశం పెట్టిండు.. ఓడిపోతామన్న భయంతో ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని చూస్తుండ్రు.. కేసీఆర్ ఇచ్చే పదివేలు తీసుకోండి… కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి.” అని ఆయన స్పష్టం చేశారు.

Revanth Reddy Speech At Thungathurthy Congress Public Meeting | Ntv