Site icon NTV Telugu

Revanth Reddy : భారత్‌ జోడో యాత్ర.. హస్తినకు టీపీసీసీ చీఫ్‌

Revanth Reddy

Revanth Reddy

కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని కీలక నేతలు వదిలి వెళ్తుండటంలో కాంగ్రెస్‌ కుర్చీ లుకలుకగా ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ బలోపేతమవుతున్న బీజేపీని ఢీ కొట్టాలంటే.. కాంగ్రెస్‌ కూడా అదేస్థాయిలో బలోపేతవడం అనివార్యం. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పేరిట పాదయాత్ర చేయనున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఈ కమ్రంలోనే తెలంగాణలో సైతం రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేయనున్నారు. అయితే.. నేడు ఈ పాదయాత్రపై సాయంత్రం ఏఐసీసీలో ఆఫీసులో సమావేశం నిర్వహించునున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.

 

భారత్‌ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 13 రోజులు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అయితే.. పాదయాత్రను పటాన్‌ చెరు, మెదక్‌, సంగారెడ్డి మీదుగా కొనసాగించాలని రేవంత్‌ రెడ్డి ఈ సమావేశం కోరే ఆలోచనలో ఉన్నట్లు టీ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పాదయాత్రను మరో రెండు రోజులు పొడిగించాలని రాహుల్‌ను రేవంత్‌ రెడ్డి కోరనున్నారు. 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 326 కిలోమీటర్ల మేర రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

 

 

Exit mobile version