NTV Telugu Site icon

Mahesh Kumar Goud : కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి

Maheshkumar

Maheshkumar

Mahesh Kumar Goud : ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పిందని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్‌ తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పై, పార్టీ ముఖ్యనేతలతో విస్తృత చర్చ జరగాలని, ఆచితూచి కమిటీ వెయ్యాల్సిన అవసరం ఉంది. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తాం అని మహేష్ గౌడ్ అన్నారు. మంత్రివర్గ విస్తరణ నాపరిధిలోది కాదు , సీఎం, ఏఐసీసీలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. నవంబర్ చివరి నాటికి తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ విస్తరణ ఉండొచ్చన్నారు. సమర్ధులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇస్తామని, కొత్త వాళ్ళు వచ్చిన చోట వాళ్ళను గౌరవించుకోవాలన్నారు. పాత కొత్త కలయిక తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు. కొత్త పాత నాయకులను మిక్స్ చేయాలని, కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయన్నారు. చాలా మంది ఎమ్మెల్సేలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, కేటీఆర్ తో రోజు ఇన్ అండ్ అవుట్ టచ్ లో ఉన్న వాళ్ళు.. మాతో టచ్ లో ఉన్నారన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ప్రభుత్వాన్ని కూలుస్తాం అని అన్నారు.. అందుకే చేరకలు జరిగాయని, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉందన్నారు మహేష్ కుమార్‌.

అంతేకాకుండా..’మాకు ఫైనల్ ఎన్నికలు 2028 లో ..రాష్ట్రంలో కాంగ్రెస్.. దేశంలో కాంగ్రెస్ గెలవాలి.. రాహుల్ పీఎం కావాలి.. బీసీ గణన పై కామన్ మ్యాన్ లా రిపోర్ట్ కావాలి.. రాహుల్ గాంధీ కూడా సీరియస్ గా ఉన్నారు.. తెలంగాణాలో బీసీ గణనపై కన్వెన్షన్. బీసీ గణన సదస్సుకు రాహూల్ , ఖర్గేలు హాజరవుతారు. బీసీ కుల గణన పై రాహుల్ లైన్ లోనే సిఎం, నేను ఉన్నాం. కులగణన జరిగితే ఎవరి వాటా వాళ్ళకే వస్తది. మల్లన్న తో మాట్లాడాను.. బీసీలకు న్యాయం కోసం పార్టీ పై కొన్ని అంశాల్లో డివేట్ అవుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడుతోంది. సోషల్ మీడియాను అనైతికంగా ఉపయోగిస్తున్నారు.
హైడ్రా, మూసీ విషయంలో ప్రజలను రెచ్చగొట్టేలా పోస్లులు పెడ్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో మిస్ లీడ్ చేస్తున్నారు.. దుబాయ్.. సింగపూర్ నుంచి సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నారు.

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

పొంగులేటి ఏ బాంబు పేలుస్తారో చూడాలి. విచ్చల విడిగా అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు కోసం జనం చూస్తున్నారు. కేటీఆర్ కు రెండేళ్లు కాదు.. పదేళ్ల శిక్ష పడే తప్పులున్నాయి. కాళేశ్వరం అంత ఖర్చు పెట్టి కట్టింది.. కమిషన్ల కోసమే.. అన్యాయంగా ఎవర్ని శిక్షంచం.. తప్పు చేసిన వాళ్లకు మాత్రం శిక్షపడాలి. విద్యుత్ అప్పటి కంటే చాలా తక్కువ ధరకు కొంటున్నం. విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు జరిగాయి. కేసీఆర్ కు ఉన్న ఆర్థిక వెసలుబాటు మాకు లేదు. ఆర్థికంగా నిర్వుండం ఉంది.. వచ్చే అధ్యాయంలో వడ్డిలకే ఎక్కువ కట్టాల్సి వస్తోంది. కేసీఆర్ లాగా మోసం చెయ్యాం.. ఇచ్చిన హామీలు అమలు చేస్తాం.. జీవన్ రెడ్డి నరనరాన కాంగ్రెస్ భావజాలమే ఉంది. జీవన్ రెడ్డి తన అనుచరుడి మర్డర్ తర్వాత ఆవేదనకు గురయ్యారు. జీవన్ రెడ్డి ఒంటరి కాదు మేమంతా ఆయన వెంట ఉన్నాం. 13 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బి ఫాం ఇచ్చింది. కొడంగల్ చేరికలపై.. బీఆర్ఎస్‌లో ఏముందని చేరతారు.. వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు..

కడుపు మండి సురేఖ అలా మాట్టాడారు.. వెంటనే వెనక్కి తీసుకున్నారు.. ముగిసిన అధ్యాయం.. మూసీ ప్రాజెక్టుకు లక్షా యాభై వేల కోట్లు అని ఎవరు చెప్పారు.. కావాలని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.. నెహ్రూ తర్వాత విజన్ తో అభివృద్ధి చేసింది నిజాం.. గత పదేళ్లలో 1500 చెరువుల్లో కబ్జా జరిగింది.. పెద్ద ప్రళయం వస్తె జనం ఇబ్బంది పడతారు.. అందుకే మూసి నీ యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.. పెద్దవాళ్ళకు నష్టం జరక్కుండా ఉండాలనేది మా ఆలోచన.. సీఎం స్టడీ చేస్తున్నారు.. హైడ్రా, మూసీ విషయంలో ప్రతిపక్షాల రాద్దాంతం చేస్తున్నాయి.. పెద్దవాళ్ళకు అన్యాయం జరక్కుండా కచ్చితంగా.. ప్రాజెక్టులు ముందుకు పోతాయి..
కచ్చితంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్తాం.. కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్చ ఉంటుంది.. ఎన్విరాన్మెంట్ అంశం పెట్టుబడులపై ప్రభావం చూపెడుతుంది.. మాదృష్టికి వచ్చిన అన్ని సమస్యలపై చర్చిస్తున్నాం.. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు.. వర్షాలు. రైతుల కష్టాలు రాలేదు ఫాం హౌస్ కి పరిమితం..

తన మన బేధం లేకుండా చర్యలు వుంటాయి.. పారదర్శకంగా అభివృద్ధి విషయంలో టెండర్ల ప్రకారం కేటాయింపులు ఉంటాయి.. మోడీ సర్కార్ అదాని, అoభానిలకు వెసలుబాటు కల్పించారు.. రతన్ టాటా నిస్వార్థ సేవ చేశాడు.. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమయిన కేసు.. డ్రగ్స్ విషయంలో కూడా ఎవ్వరినీ వదలం.. గత ప్రభుత్వం లెక్కలు చూస్తే.. చూసి చూసి ఆర్ధిక మంత్రి భట్టికి బీసీ వచ్చింది.. రియల్ ఎస్టేట్ కూడా త్వరలో పుంజుకుంటది.. దేశంలో నంబర్ వన్ గా ఉంటుంది.. జనాభా ప్రకారం డిలిమిటేషన్ వద్దని కాంగ్రెస్ చెప్తుంది.. జనాభా తక్కువ ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్నయి.. మహారాష్ట్రలో పార్టీ పేరుతో కేసీఆర్ డబ్బులు వేస్ట్ చేశారు’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..