Mahesh Kumar Goud: దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్.. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. తన స్వగ్రామం రహత్ నగర్‌లో అభివృద్ధి పనుల నిమిత్తం ఇచ్చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు పది ఎకరాలు, సబ్ స్టేషన్‌కు ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చారు. టెంపుల్ కారిడార్ ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం స్వగ్రామమైన రహత్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామప్రజలు భారీ గజమాలతో సత్కరించారు.
READ MORE: iBOMMA Ravi Father: ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత.. కౌంటర్ ఇచ్చిన తండ్రి
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. “బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. గ్రామంతో నా అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామం మీదుగా వెళ్లే టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం సీఎం, సంబంధిత మంత్రితో మాట్లాడి రూ. 380 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ రహత్‌నగర్ టెంపుల్ కారిడార్ రోడ్‌తో కరీంనగర్–నిజామాబాద్ మధ్య సెంటర్ పాయింట్ అవుతుంది. గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయి. గ్రామ అభివృద్ధి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా.” అని మహేష్ కుమార్ గౌడ్ వ్యా్ఖ్యానించారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!