Site icon NTV Telugu

Toyota vs Maruti Suzuki: టయోటా Urban Cruiser Ebella vs మారుతీ Suzuki e-Vitara: టెక్నాలజీ, డిజైన్లో తేడాలు ఇవే!

Toyata

Toyata

Toyota vs Maruti Suzuki: భారత మార్కెట్‌లో టయోటా ఎలక్ట్రిక్ SUV అయినా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ SUV, మారుతీ సుజుకి e-Vitaraకు పోటీగా నిలుస్తుంది. మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో టయోటా-మారుతీ సుజుకి కలిసి చేస్తున్న మొదటి ప్రయత్నంగా మారింది. ఇప్పటికే e-Vitara వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలో, Urban Cruiser Ebella ఆవిష్కరణతో ఈ రెండు వాహనాల మధ్య తేడాలు తెలుసుకోవాలన్న ఆసక్తి వినియోగదారుల్లో పెరిగింది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైనప్పటికీ, బ్రాండ్ డిజైన్ లో తేడాతో రెండు SUVలు మంచి గుర్తింపును పొందాయి.

Read Also: Operation Sindoor: పాక్‌పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్

ముందు భాగం (Front):
మారుతీ సుజుకి e-Vitara బోల్డ్ Y-ఆకార LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), భారీ క్లాడ్ బంపర్, ఫాగ్ ల్యాంప్స్‌తో దూకుడుగా కనిపిస్తుంది. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాకి భిన్నంగా, స్లీక్ సెగ్మెంటెడ్ DRLs, క్లీన్గా డిజైన్ చేసిన బంపర్, ఫాగ్ ల్యాంప్స్ లేని ప్రీమియం లుక్ లో కనిపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్ (Side Profile):
రెండు SUVలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, C-పిల్లర్‌లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, డోర్స్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లాడింగ్ రెండింటిలోనూ ఒకేలా కనిపిస్తాయి. రెండింటి మధ్య ఒక్క తేడా మాత్రమే ఉంది. Ebellaపై ‘BEV’ బ్యాడ్జ్ ఉండటం, ఇది దీని బ్యాటరీ ఎలక్ట్రిక్ గుర్తింపును చూపిస్తుంది.

వెనుక భాగం (Rear):
Ebellaలో స్వల్ప మార్పులు మాత్రమే కనిపిస్తాయి. టెయిల్ లైట్ డిజైన్ కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ స్లోపింగ్ రూఫ్‌లైన్, బలమైన బంపర్ e-Vitaraతో ఒకేలా ఉన్నాయి. e-Vitaraలో ట్రై-LED ప్యాటర్న్, కనెక్టెడ్ లైట్ బార్ ఉంటే, Ebellaలో సెగ్మెంటెడ్ డాట్ ప్యాటర్న్ లైట్లు ఉన్నాయి.

Read Also: Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..

డైమెన్షన్స్ (Dimensions):
యూకే స్పెక్ e-Vitaraతో పోలిస్తే, Ebella పొడవులో 10 మిల్లీమీటర్లు ఎక్కువగా, ఎత్తులో 5 మిల్లీమీటర్లు తక్కువగా ఉంటుంది. Urban Cruiser Ebellaకు 18 అంగుళాల అలాయ్ వీల్స్ ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. రెండు SUVలూ ఒకే 2,700 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉండటంతో, క్యాబిన్ స్పేస్, ప్రపోర్షన్స్‌లో పెద్ద తేడా ఏం లేదు.

పోలికలు (Similarities):
ఫీచర్లు పరంగా రెండు SUVలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇంటీరియర్‌లో Urban Cruiser Ebella కూడా e-Vitaraలో లభించే ఫీచర్లన్నింటినీ కలిగి ఉంది. రెండు SUVలలోనూ రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి.

బ్యాటరీ & పవర్‌ట్రైన్ (Battery & Powertrain):
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, మారుతీ Suzuki e-Vitara రెండింటికీ 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతకట్టబడి, వేరువేరు పవర్ అవుట్‌పుట్‌లను అందజేస్తున్నాయి. 49 kWh చిన్న బ్యాటరీతో e-Vitara సుమారు 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది, అదే సమయంలో Ebella పెద్ద 61 kWh బ్యాటరీతో ఒకే చార్జ్‌లో 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని టయోటా ప్రకటించింది. కాగా, మొత్తానికి, టయోటా Urban Cruiser Ebella వర్సెస్ మారుతీ సుజుకి e-Vitara టెక్నాలజీ, బ్యాటరీ, ఫీచర్లు పరంగా ఒకేలా ఉన్నప్పటికీ, డిజైన్, బ్రాండ్ ఐడెంటిటీ విషయంలో ప్రత్యేకతలు కనిపిస్తాయి. భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Exit mobile version