NTV Telugu Site icon

Toyota Glanza: టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు వివరాలివే

Toyota Glanza

Toyota Glanza

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ). ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌లో క్రోమ్, బ్లాక్ బాడీ సైడ్ మోల్డింగ్, బ్యాక్ డోర్ గార్నిష్‌పై క్రోమ్ యాక్సెంట్‌లు, ORVM గార్నిష్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. రూ. 20,567 విలువైన యాక్సెసరీలను కస్టమర్‌లు పొందుతారు. అలాగే.. 3D ఫ్లోర్‌మ్యాట్‌లు, ప్రీమియం డోర్ వైజర్‌లు, వెనుక సీట్లో కూర్చున్న వారి సౌకర్యం కోసం నలుపు, వెండి రంగుల నెక్ కుషన్‌లు ఉన్నాయి. అంతేకాకుండా.. బ్యాక్ బంపర్‌పై క్రోమ్ గార్నిష్, ఫెండర్లు, వెనుక రిఫ్లెక్టర్లు, వెల్ కం డోర్ ల్యాంప్‌లు ఉన్నాయి.

Read Also: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?

ఇంజన్, గేర్‌బాక్స్:
టయోటా గ్లాంజా అనేది మారుతి బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్. ఇందులో మెకానికల్ మార్పులు లేవు. ఇది 1.2-లీటర్, పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AMTతో వస్తుంది. ఇందులో CNG పవర్‌ట్రెయిన్ కూడా అందుబాటులో ఉంది. పవర్ 76 BHP, టార్క్ 98.5 Nm. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ కారుకు మూడు సంవత్సరాలు/1,00,000 కిమీల ప్రామాణిక వారంటీ లభిస్తుంది.

Show comments